తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం - ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌

ISSF World Cup India Gold medal: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్లో రాహీ సర్నోబత్‌, ఇషా సింగ్‌, రిథమ్‌ సంగ్వాన్‌ త్రయం పసిడి పతకాన్ని అందుకుంది.

ISSF World Cup India Gold medal
భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

By

Published : Mar 7, 2022, 6:34 AM IST

ISSF World Cup India Gold medal: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్లో రాహీ సర్నోబత్‌, ఇషా సింగ్‌, రిథమ్‌ సంగ్వాన్‌ త్రయం పసిడి పతకం గెలుచుకుంది. టైటిల్‌ పోరులో భారత జట్టు 17-13తో సింగపూర్‌ జట్టుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇషాకు ఇది రెండో స్వర్ణం, మూడో పతకం. ఇంతకుముందు ఆమె మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్లో విజేతగా నిలిచింది. ఇషా మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్లో రజతం సాధించింది.

మరోవైపు 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో భారత షూటర్లు శ్రియాంక, అఖిల్‌ల జోడీ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఈ జంట.. ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా కొయెక్‌, గెర్నోట్‌ రంప్లర్‌లపై విజయం సాధించింది. మూడు స్వర్ణాలు సహా ఇప్పటివరకు అయిదు పతకాలు గెలుచుకున్న భారత్‌.. ఈ టోర్నమెంట్‌ పతకాల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: కోహ్లీ వందో టెస్టులో ఎన్ని రికార్డులో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details