తెలంగాణ

telangana

ETV Bharat / sports

నార్వే చెస్​ ఓపెన్​ ఛాంపియన్​గా ప్రజ్ఞానంద​.. మూడోస్థానంలో ఆనంద్​ - నార్వే చెస్​ ఓపెన్ 2022

యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద మరోసారి అదరగొట్టాడు. 'నార్వే చెస్​ గ్రూప్ ఏ' ఛాంపియన్​గా నిలిచాడు. మరోవైపు నార్వే చెస్​ 2022 విజేతగా మాగ్నస్​ క్లార్​సన్​ నిలవగా.. గ్రాండ్​మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్​కు మూడోస్థానం దక్కింది.

ప్రజ్ఞానంద​
ప్రజ్ఞానంద​

By

Published : Jun 11, 2022, 8:11 PM IST

భారత యువ గ్రాండ్​ మాస్టర్​ ప్రజ్ఞానంద మరోసారి సత్తా చాటాడు. 'నార్వే చెస్​ ఓపెన్​ గ్రూప్​ ఏ' విభాగంలో విజేతగా నిలిచాడు. భారత్​కే చెందిన ప్రత్యర్థి వీ ప్రణీత్​పై గెలుపొంది టైటిల్​ కైవసం చేసుకున్నాడు. ఈ 16 ఏళ్ల గ్రాండ్​ మాస్టర్​.. వరుసగా తొమ్మిది రౌండ్లలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లు సాధించాడు. ప్రజ్ఞానంద తర్వాత స్థానంలో స్వీడెన్​కు చెందిన జంగ్​మిన్​ సియో, ఇజ్రాయెల్​కు చెందిన మర్సెల్​ ఎఫ్రోయిమ్స్కీలు నిలిచారు. మరోవైపు నార్వే చెస్​ 2022 ఛాంపియన్​గా ఆ దేశానికి చెందిన మాగ్నస్​ క్లార్​సన్​ నిలిచాడు.

భారత గ్రాండ్​మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్​ ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. తొమ్మిదో రౌండ్లో నార్వేకు చెందిన ఆర్యన్​ టారీపై విజయం సాధించాడు. ఈ టోర్నీలో 16.5 పాయింట్లతో క్లార్​సన్​ అగ్రస్థానంలో నిలవగా, అజర్​బైజాన్​కు చెందిన షక్రియార్​ మామెద్యారోవ్​ 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆనంద్​. 14.5 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి :మ్యాచ్​ మధ్యలో అలా కెమెరాలకు చిక్కిన యువతి.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ

ABOUT THE AUTHOR

...view details