టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచం తనను కొత్తగా చూడబోతుందని భారత స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా అన్నాడు. గురువారం క్రీడల మంత్రి కిరణ్ రిజుజు చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్న సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు.
"ఒలింపిక్స్‌లో ఆడేటప్పుడు నాలో కొత్త రెజ్లర్‌ని చూస్తారు. నేనేం చేస్తానో ఇప్పుడే చెప్పను. ఒలింపిక్స్‌లోనే చూడండి. నా శైలి, టెక్నిక్ అన్నీ కొత్తగా ఉన్నాయని మీకే అర్థం అవుతుంది. ప్రస్తుతం వీటిపైనే శిక్షణ సాగుతోంది."
-బజరంగ్ పునియా, రెజ్లర్
దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ప్రధాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. స్ప్రింటర్ మహ్మద్ అనాస్, షాట్‌పుట్ క్రీడాకారుడు తేజేంద్రపాల్ సింగ్ అర్జున అవార్డులు అందుకోగా.. మొహిందర్‌సింగ్ థిల్లాన్ ద్రోణాచార్య అవార్డు స్వీకరించాడు.
కిరణ్ రిజుజుతో మొహిందర్‌సింగ్, భజరంగ్, మహ్మద్ అనాస్, తేజిందర్ అప్పుడు అందుబాటులో లేక...
భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకలో అర్జున, ద్రోణాచార్య, రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులను క్రీడాకారులకు అందజేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. 2019 సంవత్సరానికిగాను ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ ఏడాది స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా, మహిళా పారాథ్లెట్ దీపా మాలిక్‌లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న'కు ఎంపికయ్యారు. అయితే విదేశాల్లో టోర్నీ కారణంగా అప్పుడు అవార్డు అందుకోలేకపోయాడు బజరంగ్. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు 'అర్జున'అవార్డు లభించింది.