తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ స్టార్​ రన్నర్​ సూపర్​ రికార్డ్ - అవినాశ్ సాబ్ లె రికార్డు

Indian star runner Avinash sable: భారత స్టార్‌ రన్నర్‌ అవినాశ్‌ సాబ్‌లె మరో సూపర్​ రికార్డును సాధించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఈవెంట్లో అవినాశ్‌ 5000 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు.

Avinash record
భారత్​ స్టార్​ రన్నర్​ అవినాశ్‌ జాతీయ​ రికార్డ్

By

Published : May 8, 2022, 6:55 AM IST

Indian star runner Avinash sable: భారత స్టార్‌ రన్నర్‌ అవినాశ్‌ సాబ్‌లె మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఈవెంట్లో అవినాశ్‌ 5000 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఈ రేసును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన సాబ్‌లె.. 30 ఏళ్ల క్రితం బహుదూర్‌ ప్రసాద్‌ (13 నిమిషాల 29.70 సెకన్లు, బర్మింగ్‌హామ్‌ మీట్‌, 1992) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.

ఈ ఈవెంట్లో అవినాశ్‌ 12వ స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో జాతీయ రికార్డు (8 నిమిషాల 16:21 సెకన్లు) కూడా అవినాశ్‌ పేరిటే ఉంది. ఈ మార్చిలో తిరువనంతపురంలో జరిగిన జాతీయ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. జులై 15న ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 3000 స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్‌ ఇప్పటికే బెర్తు ఖరారు చేసుకున్నాడు.

ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం సరికాదు.. సచిన్‌ను 200 కొట్టనివ్వాల్సింది'

ABOUT THE AUTHOR

...view details