తెలంగాణ

telangana

ETV Bharat / sports

Malaysia Masters 2023 టైటిల్ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్

HS Prannoy Malaysia Masters : మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీ విజేతగా నిలిచాడు భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్. ఆ వివరాలు..

Indian shuttler HS Prannoy wins Malaysia Masters
Malaysia Masters 2023 టైటిల్ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్

By

Published : May 28, 2023, 6:10 PM IST

Updated : May 28, 2023, 6:48 PM IST

Malaysia Masters 2023 winner : మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్​లో విజేతగా నిలిచాడు. 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. దీంతో తొలి వ‌ర‌ల్డ్ టూర్ టైటిల్​ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ట్రోఫీని అందుకోవడంతో పాటు రూ. 25 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని అందుకున్నాడు. ఈ ఏడాది.. అత‌డికి ఇదే తొలి ఏటీపీ టైటిల్. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం అతడు తీవ్రంగా శ్రమించాడు. మొదటి సెట్​లో గెలిచి.. ఆ తర్వాత ఓడినా.. మూడో సెట్​లో తన అద్భుత ప్రదర్శనతో ఈ ఘనత సాధించాడు. పీవీ సింధు, శ్రీకాంత్ లాంటి స్టార్​ ప్లేయర్స్ చేతులేత్తేసిన ఈ టోర్నీలో.. అతడు టైటిల్​ను ముద్దాడటం విశేషం.

ఫస్ట్ సెట్​ సాగిందిలా..

Malaysia Masters 2023 HS Prannoy : ప్రణయ్​-వెంగ్​ హాంగ్​.. డ్రాప్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్​లతో హోరాహోరీగా తలపడ్డారు. ప్రతీ పాయింట్ కోసం ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. అయితే ప్రణయ్ తన అసాధారణ ఆటతో ఆధిపత్యం చెలాయించి ఫస్ట్​ సెట్​లో 21-19తేడాతో గెలుపొందాడు. ఈ సెట్ 31 నిమిషాల పాటు సాగింది.

సెకండ్​ సెట్​ సాగిందిలా.. అయితే రెండో గేమ్‌లో మాత్రం చైనా షట్లర్ దీటుగా బదులిచ్చాడు. పదునైన స్మాష్ లు, డ్రాప్ షాట్లలతో ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దీంతో వార్ వన్​సైడ్ అయిపోయింది. భారత షట్లర్​ ప్రణయ్​ తప్పిదాలు చేయగా.. యాంగ్ జోరును కొనసాగించి రెండో గేమ్​ను 13-21 తేడాతో సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ 26 నిమిషాల పాటు కొనసాగింది.

మూడో సెట్​ సాగిందిలా..మూడో సెట్​లో ప్రణయ్-వెంగ్.. ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. మెదట్లో వెంగ్ దూకుడు ప్రదర్శించినా.. ఆ తర్వాత అప్రమత్తమైన ప్రణయ్.. పదునైన స్మాష్​లతో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు జరిగాయి. ఇద్దరి మధ్య ఆధిపత్యం దోబుచులాడింది. ఆఖర్లో 18-18 తేడాతో ఇద్దరూ సమంగా కూడా నిలిచారు. అనంతరం చెలరేగిన ప్రణయ్ ఒకేసారి వరుసగా రెండు పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుని 20-18తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరికి 21-18తో మూడో సెట్​తో పాటు మ్యాచ్​ను సొంతం చేసుకున్నాడు. ఈ మూడో సెట్ 34 నిమిషాల పాటు సాగింది.

నిరాశ ప‌రిచిన సింధు, శ్రీ‌కాంత్‌

Malaysia Masters 2023 PV Sindhu :మ‌లేషియా మాస్టర్స్‌లో ఎన్నో అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన‌ ఒలింపిక్ ప‌త‌క విజేత‌ పీవీ సింధు, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీ‌కాంత్ నిరాశ‌ప‌రిచారు. మ‌హిళ‌ల సింగిల్స్‌లో ఫేవరెట్​గా బరిలోకి దిగి ఆశ‌లు రేపిన సింధు.. సెమీఫైన‌ల్లో ఓట‌మిని అందుకుని ఇంటికి వెళ్లింది. ఇండోనేషియా ప్లేయర్​ జార్జియా మ‌రిస్కా తుంజంగ్ చేతిలో 14-21,17-21తో ఓడిపోయింది. ఇకపోతే శ్రీ‌కాంత్.. క్వార్ట‌ర్ ఫైన‌ల్లోనే నిష్క్ర‌మించాడు.

ఇదీ చూడండి:

Malaysia Masters 2023 : పీవీ సింధుకు నిరాశ.. ఫైనల్స్​కు చేరిన ప్రణయ్​

కొత్త పార్లమెంట్​ వద్ద టెన్షన్​.. టెన్షన్​.. ముట్టడికి రెజ్లర్ల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

Last Updated : May 28, 2023, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details