తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​నకు భారత షూటర్లు - ప్రపంచ షూటింగ్ టోర్నీకి భారత్ ప్రాతినిథ్యం

టోక్యో ఒలింపిక్స్​కు ముందు ప్రపంచకప్​ షూటింగ్ టోర్నీని క్రొయేషియాలో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భారత షూటర్లు ప్రాతినిథ్యం వహించనున్నారు.

indian shooters
భారత షూటర్లు

By

Published : May 8, 2021, 7:19 AM IST

టోక్యో ఒలింపిక్స్​కు ముందు చివరిదైన ప్రపంచకప్​ షూటింగ్​ టోర్నీని క్రొయేషియాలో నిర్వహించనున్నారు. వచ్చే నెల 22న ఆరంభం కానున్న ఈ టోర్నీలో భారత షూటర్లు ప్రాతినిథ్యం వహించనున్నారు.

ముందుగా అనుకున్న దాని ప్రకారం అజర్​బైజాన్​లో ఈ టోర్నీ నిర్వహించాల్సింది. కానీ ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో క్రొయేషియాకు తరలించారు. అయితే అంతకంటే ముందు ఈ నెల 20 న క్రొయేషియాలో ప్రారంభం కానున్న యూరోపియన్ ఛాంపియన్​షిప్ కోసం 15 మంది షూటర్ల భారత బృందం మంగళవారం ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది. అక్కడే ప్రపంచకప్​లోనూ పాల్గొన్న తర్వాత నేరుగా ఒలింపిక్స్ కోసం మన షూటర్లు టోక్యో వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:బయోబబుల్ ప్రమాదమని అనుకోలేదు: స్మిత్

ABOUT THE AUTHOR

...view details