తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ రికార్డు.. ఆపై ఫైనల్​కు అర్హత

భారత స్టీపుల్​ ఛేజ్​ రన్నర్​ అవినాశ్.. 3000 మీటర్ల విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించాడు. జావెలిన్ త్రోలో అన్నురాణి విఫలమైంది.

భారత అథ్లెట్ అవినాశ్

By

Published : Oct 2, 2019, 8:11 AM IST

Updated : Oct 2, 2019, 8:29 PM IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సేబల్‌ స్టీపుల్‌ ఛేజ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తొలుత తుది సమరానికి అర్హత సాధించని ఈ క్రీడాకారుడు.. నాటకీయ పరిణామాల మధ్య ముందంజ వేశాడు. ప్రత్యర్థులు అడ్డు తగలడం వల్ల వెనకబడిన అవినాశ్‌కు ప్రపంచ అథ్లెటిక్‌ సమాఖ్య.. ఫైనల్లో పోటీపడే అవకాశం కల్పించింది.

పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో జాతీయ రికార్డు అధిగమించి ఫైనల్లోకి ప్రవేశించాడు అథ్లెట్‌ అవినాశ్‌. మంగళవారం జరిగిన హీట్స్‌లో 8:25.23 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (8:28.94)ను బద్దలు కొట్టాడు.

భారత అథ్లెట్ అవినాశ్
అయితే హీట్‌-3లో ఏడో స్థానంలో నిలిచిన అవినాశ్‌.. మొదట తుది పోరుకు అర్హత సాధించలేకపోయాడు. కానీ ఈ రేసులో అతడి పరుగుకు రెండుసార్లు ప్రత్యర్థులు అనుకోకుండా అడ్డుపడ్డారు. ఈ విషయంపై ప్రపంచ అథ్లెటిక్‌ సమాఖ్యకు ఫిర్యాదు చేసింది భారత అథ్లెటిక్‌ సమాఖ్య. వీడియోలు పరిశీలించిన ప్రపంచ సంస్థ.. అవినాశ్‌ను ఫైనల్‌కు ఎంపిక చేసింది.

అన్ను విఫలం
మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్లో అన్నురాణి విఫలమైంది. తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 59.25 మీటర్ల దూరం విసిరిన ఈ క్రీడాకారిణి.. రెండో ప్రయత్నంలో 61.12 మీటర్ల దూరం విసిరింది. మొత్తంమీద ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇది చదవండి: ప్లాగింగ్​: దేశవ్యాప్తంగా ప్రారంభమైన 'స్వచ్ఛ' పరుగు

Last Updated : Oct 2, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details