భారత పురుషుల ఆర్చరీ జట్టు సత్తాచాటింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్ కోటా స్థానాన్ని దక్కించుకుంది. గత ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన భారత జట్టు ఈ సారి గట్టిగానే కృషి చేసింది.
ఒలింపిక్ బెర్తు సాధించిన భారత ఆర్చరీ జట్టు - జ్యోతి సురేఖ
నెదర్లాండ్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న భారత ఆర్చరీ పురుషుల జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టడమే కాకుండా 2020 ఒలింపిక్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
ఒలింపిక్ బెర్తు సాధించిన భారత ఆర్చరీ జట్టు
బుధవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, అతాను దాస్‌లు ఉన్న భారత జట్టు 5-3 తేడాతో కెనడాపై విజయం సాధించింది. మరోవైపు తెలుగు ఆర్చర్ జ్యోతిసురేఖ కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లో అడుగుపెట్టింది. మహిళల కాంపౌండ్ జట్టు ప్రి క్వార్టర్స్‌లో 236- 226తో ఫ్రాన్స్‌పై నెగ్గి క్వార్టర్స్ చేరింది.
ఇది చదవండి: దిశా ఘోష్- నెట్టింట మరో ప్రియా వారియర్!