తెలంగాణ

telangana

ETV Bharat / sports

పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం - పీటీ ఉషకు అరుదైన గౌరవం

భారత మాజీ స్ప్రింటర్​ పీటీ ఉషకు అరుదైన గౌరవం లభించింది. ఆసియా అథ్లెటిక్స్​ అసోసియేషన్​(ఏఏఏ)లో సభ్యురాలిగా చోటు దక్కింది. ఆరుగురు సభ్యుల బృందంలో భారత్​ నుంచి ఎంపికయిందీ దిగ్గజ క్రీడాకారిణి.

పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం

By

Published : Aug 14, 2019, 11:31 AM IST

Updated : Sep 26, 2019, 11:15 PM IST

ఆసియా అథ్లెటిక్​​ అసోసియేషన్ (ఏఏఏ) కీలక విభాగంలో చోటు దక్కించుకుంది పరుగుల రాణి పీటీ ఉష. ఆరుగురు సభ్యుల అథ్లెట్స్ కమిషన్​లో ఆమెకు స్థానం లభించింది. ఈ బృందానికి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఒలింపిక్స్​ స్వర్ణ పతక విజేత ఆండ్రే అబ్దువలియేమ్ అధ్యక్షత వహించనున్నాడు.

" ఏఏఏ అథ్లెట్స్​ కమిషన్ సభ్యురాలిగా ఎంపికవడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం ఇవ్వడాన్ని మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఇది నాకు, దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా".

-- పీటీ ఉష, భారత మాజీ స్ప్రింటర్​

ఇందులో చైనాకు చెందిన వాంగ్​యు, కజకిస్థాన్​కు చెందిన ట్రిపుల్​ జంపర్​ ఓల్గా రిప్కోవా, మలేసియా నుంచి లీ హుప్​ వే, సౌదీ అరేబియా నుంచి షాదాద్​ ఉన్నారు. కొత్తగా ఎంపికైన ఉషను ఏఏఏ సెక్రటరీ జనరల్​ ఏ షుగ్గుమారన్​ అభినందించారు.

పరుగుల రాణి పీటీ ఉష

1980వ దశకంలో ఆసియాలోనే అత్యుత్తమ​ అథ్లెట్​గా పేరు తెచ్చుకుందీ పయోలి ఎక్స్​ప్రెస్. 1984 లాస్ ఏంజెలిస్​ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకన్లో వందో వంతు తేడాతో కాంస్య పతకం కోల్పోయింది ఉష. 1986 సియోల్​ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలు నెగ్గిందీ స్టార్​ స్ప్రింటర్​. జకార్తా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, కాంస్యంతో సత్తాచాటింది.

ఇదీ చదవండి...పాక్​, ఇంగ్లాండ్​ను ఓడించి ఛాంపియన్​గా భారత్​

Last Updated : Sep 26, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details