కామన్వెల్త్ క్రీడల్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు పతకాలను కైవసం చేసుకుంది. మహిళల జూడో 48కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి ఎల్. సుశీలాదేవీ రజతాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన మిచెలా వైట్‌బూయి చేతిలో ఓడిన సుశీలా.. రజత పతకాన్ని గెలుచుకున్నారు. పురుషుల 60కిలోల విభాగంలో విజయ్‌కుమార్ యాదవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 2018, 2019 కామన్వెల్త్ క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచిన విజయ్‌కుమార్ కాంస్యాన్ని సాధించారు.
జూడోలో అదరగొట్టిన భారత్.. కామన్వెల్త్లో రెండు పతకాలు
22:14 August 01
జూడోలో అదరగొట్టిన భారత్.. కామన్వెల్త్లో రెండు పతకాలు
మోదీ, షా అభినందనలు:
కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన సుశీలాదేవి, విజయ్‌కుమార్ యాదవ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సుశీలా దేవి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా క్రీడాకారులను అభినందించారు.
ఇవీ చదవండి:Commonwealth Games: ఆ అన్న త్యాగం.. తమ్ముడికి స్వర్ణం
'పాక్ చేసిన తప్పే బీసీసీఐ చేస్తోంది.. అలాంటి కెప్టెన్లు కావాలి'