లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఐదో పరాజయం చవిచూశాడు. ఆదివారం ఐదో రౌండ్లో అతడు 2-3తో పీటర్ లెకో (హంగేరి) చేతిలో కంగుతిన్నాడు. ఆనంద్ ఇంతకుముందు పీటర్ స్విద్లర్, మాగ్నస్ కార్ల్‌సన్, వ్లాదిమర్ క్రామ్నిక్, అనిష్ గిరి చేతిలో ఓడిపోయాడు.
లెజెండ్స్ చెస్‌లో ఆనంద్‌కు ఐదో ఓటమి - లెజెండ్స్ చెస్‌లో ఆనంద్‌కు ఐదో ఓటమి
భారత దిగ్గజ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఐదో ఓటమి మూటగట్టుకున్నాడు. లెజెండ్స్ ఆఫ్ చెస్ టోర్నీలో పాల్గొన్న ఆయన.. ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేదు.
లెజెండ్స్ చెస్‌లో ఆనంద్‌కు ఐదో ఓటమి
ఆనంద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాడు. మరో గేమ్‌లో 3-2తో ఇవాన్‌చుక్‌పై గెలిచిన ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.