తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మెల్ట్‌వాటర్‌' చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ప్రజ్ఞానందకు నిరాశ - Praggnanandhaa in finals

మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద పోరాడి ఓడిపోయాడు. చైనా ఆటగాడు డింగ్‌ లీరెన్‌ దూకుడుతో ఓటమి తప్పలేదు.

Praggnanandhaa
ప్రజ్ఞానంద

By

Published : May 27, 2022, 9:56 AM IST

మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. రెండు రోజలు పాటు ప్రపంచ రెండో ర్యాంకర్‌ డింగ్‌ లీరెన్‌ (చైనా)తో జరిగిన పోరులో ఓడిపోయాడు.

ఆఖరి సమరంలో భాగంగా తొలిరోజు ప్రజ్ఞానంద 1.5-2.5తో నిలిచాడు. మొదటి తొలి గేమ్‌ను కోల్పోయినా రెండో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేశాడు. అయితే మూడో గేమ్​ను మళ్లీ ప్రజ్ఞానంద కోల్పోవల్సి వచ్చింది. నాలుగో గేమ్‌ను 39 ఎత్తుల్లో డ్రా చేసుకుని ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. చివరి రోజు జరిగిన గేమ్​లలో లీరెన్‌ ముందంజలో ఉండటం వల్ల అతిడినే విజేతగా ప్రకటించారు న్యాయ నిర్ణేతలు.

ABOUT THE AUTHOR

...view details