సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరిగిన గేమ్‌ల్లో జెఫరీ షావోమిపై 66 ఎత్తుల్లో నెగ్గిన హరికృష్ణ.. నకమురతో డ్రా చేసుకున్నాడు. మరో గేమ్‌లో వెస్లీ సో చేతిలో హరి ఓడిపోయాడు.
ఐదో స్థానంలో హరికృష్ణ.. అగ్రస్థానానికి వెస్లీ - హరికృష్ణ గెలుపు
సెయింట్ లూసియా ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 9 పాయింట్లతో నకమురతో కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో ఉన్నాడు.

ఐదో స్థానంలో హరికృష్ణ
మొత్తం 9 పాయింట్లతో హరికృష్ణ, లెవోన్ అరోనియన్, నకముర ఉమ్మడిగా ఐదో స్థానంలో ఉన్నారు. 13 పాయింట్లతో వెస్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (12 పాయింట్లు) ద్వితీయ స్థానంలో ఉన్నాడు.