తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీల్​ చెస్​ ఫెస్టివల్​ విజేతగా హరికృష్ణ​ - చెస్​960 టోర్నీ

బీల్​ ఫెస్టివల్​ చెస్​ 960 టోర్నమెంట్​లో భారత గ్రాండ్​ మాస్టర్​ పి.హరికృష్ణ విజేతగా నిలిచాడు. టోర్నీలో జరిగిన ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు నమోదు చేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.

Indian GM Harikrishna wins Chess960 event at Biel Festival
బీల్​ చెస్​ ఫెస్టివల్​లో అగ్రస్థానానికి చేరిన భారత గ్రాండ్​ మాస్టర్​

By

Published : Jul 19, 2020, 6:30 PM IST

53వ బీల్ చెస్​ ఫెస్టివల్​ 2020లో భాగంగా జరిగిన అక్సెంటస్​ చెస్​960 టోర్నీలో భారత గ్రాండ్​ మాస్టర్​ పి.హరికృష్ణ విజేతగా నిలిచాడు. జరిగిన ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు నమోదు చేసి తొలిస్థానంలో ఉన్నాడు. చివరి రౌండ్లో పొలాండ్​కు చెందిన రాడోస్లా వోజ్టాస్జెక్​ ఓడిపోవడం హరికి కలిసొచ్చింది.

కరోనావ్యాప్తికి నియంత్రణగాతొలి మూడు స్థానాల్లో

ఫిషర్​ రాండమ్​ చెస్​గా ప్రాచుర్యం పొందిన చెస్​960 టోర్నీలో జర్మన్​ విన్సెంట్​ కీమర్ ఐదు పాయింట్లతో హరికృష్ణ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 4.5 పాయింట్లు నమోదు చేసిన వోజ్టాస్జెక్ మూడోస్థానానికి పరిమితమయ్యాడు. ఈ టోర్నీలో యూఏఈ గ్రాండ్​ మాస్టర్​ సేలం సలేహ్​ కరోనా ప్రయాణ ఆంక్షల వల్ల పాల్గొనలేకపోయాడు. అతడికి బదులుగా గ్రాండ్​ మాస్టర్​ అర్కాదీజ్​ నైదిట్ష్​ టోర్నీలో పాల్గొన్నాడు.

ఈ టోర్నీ క్లాసికల్​ ఈవెంట్​ జులై 21న అంటే సోమవారం ఒక్కరోజు విరామం తర్వాత జరగనుంది. కరోనా వ్యాప్తి నియంత్రణగా టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. ఆటగాళ్ల మధ్య రెండు టేబుల్స్​ ఉంచడం సహా ప్రతి ఆట ముగిసిన తర్వాత అన్ని చెస్​ ముక్కలను, చెస్​ టైమర్లను శుభ్ర పరుస్తున్నారు. టోర్నీకి ప్రేక్షకులను అనుమతించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details