తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇద్దరిని చంపినందుకు భారత మాజీ అథ్లెట్ అరెస్ట్​ - Athelete Iqbal Singh news 2020

భారత మాజీ అథ్లెట్​ ఇక్బాల్​ సింగ్​ను హత్య కేసుల్లో అరెస్టు చేశారు పోలీసులు. అమెరికాలోని డెల్వార్​ కౌంటీలో ఉంటోన్న ఆయన.. సొంతవ్యక్తులనే చంపినట్లు ఒప్పుకొన్నాడట.

Indian former Athelete Iqbal Singh
ఇద్దరిని చంపినందుకు అరెస్ట్​ అయిన భారత మాజీ అథ్లెట్

By

Published : Aug 26, 2020, 8:32 PM IST

భారత్‌ తరఫున ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన అథ్లెట్‌ ఇక్బాల్‌ సింగ్‌.. అమెరికాలో జరిగిన హత్యకేసులో అరెస్టయ్యాడు. తన భార్య, తల్లిని హత్య చేసినట్లు ఇక్బాల్‌ అంగీకరించాడని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. 62 ఏళ్ల ఇక్బాల్‌ డెల్వార్‌ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఆదివారం పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడట.

"ఆదివారం పోలీసులు ఇక్బాల్‌ ఇంటికి వెళ్లేసరికి అతని శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. విపరీతంగా రక్తం కారుతోంది. అదే ఇంట్లో రెండు మృతదేహాలు దొరికాయి. సింగ్‌కు అయిన గాయాలు సొంతంగా చేసుకొన్నవే" అని పోలీసులు తెలిపారు. క్రూరంగా హత్య చేయడం వంటి అభియోగాలాను మోపి అతడిపై కేసు నమోదు చేశారు. నేరాల తీవ్రత చూస్తే బెయిల్‌ కూడా వచ్చే అవకాశం లేదు.

సింగ్‌ ఇంట్లో వారిద్దరిని హత్య చేశాక.. తన కుమారుడికి ఫోన్‌ చేసి.."మీ అమ్మ.. నానమ్మని హత్యచేశాను. పోలీసులను వచ్చి అరెస్టు చేయమని చెప్పు" అని పేర్కొన్నాడట. హత్యకు గల కారణాలు తెలియలేదు.

ఇక్బాల్‌ 1983లో కువైట్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details