జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో భారత బాక్సర్లు సత్తాచాటుతున్నారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో గెలిచిన శివథాపా, పూజారాణి.. ఫైనల్‌కు అర్హత సాధించారు.
పురుషుల63 కేజీల విభాగంలో జపాన్‌కు చెందిన డైసుకే నారిమత్సుపై విజయం సాధించాడు శివ థాపా. నాలుగుసార్లు ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన ఈ బాక్సర్ పంచ్‌లకు ప్రత్యర్థి నేలకొరిగాడు.