భారత మహిళా బాక్సర్లు ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నారు. రష్యాలోని ఉలాన్ ఉద్ వేదికగా జరగుతున్న వరల్డ్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్ చేరారు. బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో జమునా, లవ్లీనా అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరినీ అభినందిస్తూ ట్వీట్లు చేశారు క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు.
టాప్-5 సీడ్‌నే...
ప్రపంచ ఐదో సీడ్ ఒయిదాద్(అల్జీరియా)కు షాకిచ్చింది జమునా బోరో. బుధవారం జరిగిన 54 కేజీల విభాగం ప్రీ క్వార్టర్స్‌లో పోటీపడిన ఈ బాక్సర్... 5-0 తేడాతో గెలిచింది. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో యులియా(బెలారస్)పై విజయం సాధించి.. కెరీర్లో తొలి ప్రపంచ పతకం ఖాయం చేసుకోవాలనుకుంటోంది జమునా.