తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రెసిడెంట్​ కప్​లో భారత బాక్సర్ల హవా - etvbharat

అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు సత్తా చాటారు. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 23వ ప్రెసిండెట్స్​ కప్​లో సిమ్రన్​ జిత్​ కౌర్, దినేశ్​ దగర్​ తిరుగులేని ప్రదర్శన చేశారు. గురువారం జరిగిన ఆయా విభాగాల్లో ప్రత్యర్థులకు పంచ్​ పవర్​ చూపించి ఫైనల్ చేరారు.​ మరో నలుగురు క్రీడాకారులు సెమీ ఫైనల్లో అడుగుపెట్టారు.

ప్రెసిడెంట్​ కప్​లో భారత బాక్సర్ల హవా

By

Published : Jul 26, 2019, 11:25 AM IST

ప్రెసిడెంట్​ కప్​లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. ప్రపంచ ఛాంపియన్​ షిప్​ కాంస్య విజేత సిమ్రన్​ జిత్​ కౌర్​(60 కేజీలు), జిబీ బాక్సింగ్​ వెండి గ్రహీత దినేశ్​ దగర్​(69 కేజీలు) గురువారం జరిగిన సెమీస్​ మ్యాచ్​ల్లో జోరు చూపించారు.

ఇటలీ క్రీడాకారిణి ఫ్రాన్సెసాపై 5-0 తేడాతో గెలుపొందింది సిమ్రన్​, ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన హసన హుస్వతుతో టైటిల్​ పోరుకు సిద్ధమౌతోంది. గతేడాది జరిగిన ఇండియా ఓపెన్​లో కాంస్యం గెలిచిన దినేశ్​... ఇండోనేషియా ఆటగాడు నౌమియో డెఫ్రీపై 5-0 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్​లో ఇండోనేషియన్​ సమద సపుత్రతో కప్పు కోసం తలపడనున్నాడు.

మరో నలుగురు..

ఇదే టోర్నీలో మరో నలుగురు భారత ఆటగాళ్లు రాణించారు. అంకుశ్​ దహియా(64 కేజీలు), జమున బోరో(54 కేజీలు) అనంత ప్రహద్​ (52కేజీలు), నీరజ్​ స్వామి(49 కేజీలు) విభాగాల్లో సెమీఫైనల్​ చేరారు.

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​ షిప్​ విజేత మేరీకోమ్​ సారథ్యంలో 10 మందితో కూడిన భారత బృందం ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి వెళ్లింది. జులై 28తో టోర్నమెంట్​ ముగియనుంది.

ఇవీ చూడండి...కెనడా లీగ్: అంపైర్​ నిర్ణయానికి బలైన యువీ

ABOUT THE AUTHOR

...view details