తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ బాక్సింగ్‌ ఫైనల్లో మంజురాణి - హరియాణాకు చెందిన మంజురాణి

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్​ మంజురాణి ఫైనల్​కు చేరుకుంది. 48 కిలోల విభాగంలో థాయిలాండ్ క్రీడా కారిణి రాక్షత్​ను మట్టికరిపించి పసిడికి దగ్గరగా నిలిచింది.

ప్రపంచ బాక్సింగ్‌: ఫైనల్లో మంజురాణి

By

Published : Oct 12, 2019, 8:49 PM IST

భారత బాక్సర్‌ మంజురాణి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్స్‌ 48 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. ఫలితంగా మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. హరియాణాకు చెందిన ఈ క్రీడాకారిణి క్వార్టర్స్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జ మెమొరియల్‌ బాక్సింగ్‌ పోటీల్లో మంజు రజత పతకం కైవసం చేసుకుంది.

మేరీ కోమ్​ రికార్డు

భారత స్టార్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ సెమీస్‌లో ఓడింది. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్‌ బుసెనాజ్‌ చేతిలో 1-4 తేడాతో పరాజయం పాలై కాంస్యం పతకాన్ని అందుకుంది. ఫలితంగా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్స్‌లో ఎనిమిది పతకాలు సాధించిన బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఆరు పసిడి, ఒక రజతం, మరో కాంస్యం గెలుచుకుంది.

భారత మరో బాక్సర్‌ జమునా బోరో ప్రపంచ ఛాంపియన్స్‌షిప్స్‌ 54 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.

ఇవీ చూడండి.. వైరల్​: రోహిత్​ను కిందపడేసిన అభిమాని

ABOUT THE AUTHOR

...view details