తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిక్స్​డ్ రిలేలో భారత జట్టుకు ఏడో స్థానమే... - Indian 4x400m mixed relay team finishes 7th in World C'ships

ఖతార్ దోహా వేదికగా జరుగుతోన్న అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్​ 4x400 రిలే ఫైనల్లో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. సీజన్​లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది.

మిక్స్​డ్

By

Published : Sep 30, 2019, 10:29 AM IST

Updated : Oct 2, 2019, 1:44 PM IST

మహ్మద్ అనాస్, వీకే విస్మయ, జిస్న మాథ్యూ, నిర్మల్ తోమ్​లతో కూడిన భారత 4x400 రిలే జట్టు శనివారం జరిగిన క్వాలిఫయర్​లో సత్తా చాటి ఫైనల్​కు అర్హత సాధించింది. కానీ ఎనిమిది దేశాలు పాల్గొన్న తుదిపోరులో 3:15.77 నిమిషాల్లో రేసును పూర్తి చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్స్​కు క్వాలిఫై అవడం ద్వారా ఇప్పటికే ఒలింపిక్స్​ బెర్త్ ఖాయం చేసుకుంది భారత మిక్స్​డ్ రిలే జట్టు.

ఇంతకుముందు ఆసియాన్ గేమ్స్​లో ఇదే జట్టు 3:15:71 నిమిషాల్లో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

ఈ టోర్నీలో మిక్స్​డ్ రిలేను తొలిసారిగా ప్రవేశపెట్టగా.. పోటీల్లో అమెరికా జట్టు స్వర్ణం ఎగరేసుకుపోయింది. 3:09:34 నిమిషాల్లో రేసును పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచింది. జమైకా (3:11:78) రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇవీ చూడండి.. మ్యాచ్​ తర్వాత బంతిని ఏం చేస్తారో తెలుసా..?

Last Updated : Oct 2, 2019, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details