2028లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్ తొలి పది స్థానాల్లోపు నిలుస్తుందని అన్నారు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు. టోక్యో ఒలింపిక్స్‌కు ప్రతిభావంతులైన క్రీడాకారులు వెళ్తున్నప్పటికీ, లాస్ ఏంజలిస్‌లో జరిగే మెగా టోర్నీనే.. భారత్ అథ్లెట్ల ముందున్న లక్ష్యమని అన్నారు.
"ప్రపంచంలో 20 శాతం యువత భారత్‌లోనే ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు యువకుడు/యువతి. ఇంతమంది ఉన్నా.. ఒకటి లేదా రెండు బంగారు పతకాలు సాధించడం భావ్యమా?. ఈ పరిస్థితిని అంగీకరించేందుకు సిద్ధంగా లేం. భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్ తయారు చేశాం. టోక్యో మెగా క్రీడలు కోసం సంసిద్ధంగా ఉన్నాం. కానీ కొన్ని పరిమితులున్నాయి. అయితే మా అసలు లక్ష్యం 2028 ఒలింపిక్స్. అందులో టాప్-10లో నిలుస్తాం"