దిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత మహిళల బృందం స్వర్ణం సాధించింది. ఇందులో మను బాకర్, యశస్విని దీస్వాల్, శ్రీ నివేదా పరమనాథన్ ఉన్నారు. ఆదివారం జరిగిన పోరులో పోలాండ్ బృందంపై గెలిచి ఈ పతకం చేజిక్కుంచుకుంది.
ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, పంకజ్ కుమార్‌లతో కూడిన బృందం.. వెండి పతకం సాధించింది. మహిళల విభాగం కాంస్యం సొంతం చేసుకుంది.