తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్వర్ణంతో మెరిసిన సరిత.. మరో ఇద్దరికి కాంస్యాలు - seema bisla wrestler won bronze

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. డిఫెండింగ్ ఛాంపియన్​ సరిత మోర్​ స్వర్ణం సొంతం చేసుకోగా.. సీమా బిస్లా, పూజ కాంస్యాలతో మెరిశారు.

saritha mor, indian wrestler
సరిత మోర్​, భారత రెజ్లర్

By

Published : Apr 16, 2021, 10:35 AM IST

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సరిత మోర్‌ సత్తా చాటింది. ఈ సోనెపట్‌ అమ్మాయి అద్భుత పోరాటం వల్ల పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 59 కేజీల విభాగం ఫైనల్లో సరిత 10-7తో షువ్‌దోర్‌ (మంగోలియా)పై విజయం సాధించింది. తుది పోరులో ఒక దశలో 1-7తో వెనకబడి పరాజయం అంచున నిలిచిన సరిత.. ఆఖరి రెండు నిమిషాల్లో అనూహ్యంగా పుంజుకుంది. వరుస పాయింట్లతో ప్రత్యర్థికి చేరువైన ఆమె.. 20 సెకన్లలో బౌట్‌ ముగుస్తుందనగా.. ఒకే పట్టులో నాలుగు పాయింట్లు సాధించి అనూహ్య విజయాన్ని అందుకుంది.

ఇదీ చదవండి:ఐపీఎల్: ధర మినిమమ్ కానీ ఆడితే మ్యాక్సిమమ్!

అంతేకాదు అంతకుముందు తొలి బౌట్లో షువ్‌దోర్‌ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. తొలి బౌట్లో షువ్​దోర్​ చేతిలో 4-5తో పోరాడి ఓడిన సరిత.. రెండో రౌండ్లో డయానాపై గెలిచి ఆశలు నిలబెట్టుకుంది. ఆపై సెమీస్​లో నురౌదా (కిర్గిస్థాన్‌)పై నెగ్గింది. గతేడాది దిల్లీలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ సరిత స్వర్ణం గెలుచుకుంది. మరోవైపు సీమా బిస్లా (50 కేజీలు), పూజ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. కాంస్య పోరులో యంగ్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ)పై సీమా గెలవగా, పూజ 5-2తో సెయాన్‌ జంగ్‌ (కొరియా)ను ఓడించి కంచు నెగ్గింది. మరో భారత రెజ్లర్​ నిషా తొలి రెండు రౌండ్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇదీ చదవండి:మ్యాచ్​పై ఆశల్లేవు.. డెత్​ ఓవర్లే కొంప ముంచాయి

ABOUT THE AUTHOR

...view details