టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని పారాలింపిక్స్ సెక్రటరీ జనరల్ గురుశరన్ సింగ్ అన్నారు. భారత్..15 మెడల్స్ సాధిస్తుందని అందులో 5 బంగారు పతకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పారాలింపిక్స్‌లో మొత్తం 9 క్రీడల్లో 54 మంది భారత పారా అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పోటీల్లో భారత్ తరపున ఇంత మంది అథ్లెట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. పారా ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా కానోయింగ్, షూటింగ్ పారా స్పోర్ట్, పారా స్విమ్మింగ్, పారా పవర్ లిఫ్టింగ్, పారా టేబుల్ టెన్నిస్, పారా తైక్వాండో పోటీల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు.
"ఈ ఏడాది పారాలింపిక్స్ భారత్ ఎల్లప్పుడు గుర్తుపెట్టుకునేలా నిలిచిపోతుంది. భారత పారా అథ్లెట్లు కఠోరంగా శ్రమించి.. అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ప్రస్తుతం కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు వారు సిద్ధంగా ఉన్నారు."
--గురుశరన్ సింగ్, సెక్రటరీ జనరల్.