ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. 32వ ఒలింపిక్ గేమ్స్ శుక్రవారం ఆరంభోత్సవంతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జపాన్ జాతీయ స్టేడియంలో.. ఈ విశ్వ క్రీడల ముందస్తు కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
'యునైటెడ్ బై ఎమోషన్' ధీమ్ ద్వారా 2013లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు టోక్యో బిడ్ సాధించనప్పటి నుంచి గతేడాది కరోనా సంక్షోభం కారణంగా విశ్వక్రీడలు వాయిదా పడిన సందర్భాలను ఓ వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారు. 20 సెకన్ల తర్వాత బాణసంచా ప్రారంభమయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ 2020 చిహ్నం ఆకారంలో బాణసంచా మిరుమిట్లు గొలిపాయి. ఇది జపాన్ సంప్రదాయం ప్రకారం శుభసూచికానికి గుర్తుగా చెప్పుకుంటారు.