మాజీ క్రీడాకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు
మాజీ క్రీడాకారులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు.. వారికి ఉపాధి కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాల్ని ఏర్పాటు చేయనుంది.
ఖేలో ఇండియా
"మాజీ క్రీడాకారులకు ఉపాధి కల్పించడానికి, దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాల్ని ప్రారంభిస్తున్నాం. ఒక క్రీడాకారుడు బాధపడితే కొన్ని తరాలు నిరుత్సాహపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం క్రీడాకారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం" అని రిజిజు చెప్పారు.
ఇదీ చూడండి : పారా అథ్లెట్లు దేశానికే స్ఫూర్తి: కిరణ్ రిజిజు