India Wada Rank: ప్రపంచంలో డోప్ ఉల్లంఘనల జాబితాలో భారత్ మూడో ర్యాంకు సాధించింది. 2019 సంవత్సరానికిగాను మంగళవారం వాడా(World Anti Doping Agency) ప్రకటించిన జాబితాలో 152 డోప్ ఉల్లంఘనలతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన డోప్ ఉల్లంఘనల్లో ఇది 17 శాతం. రష్యా (167) ప్రథమ, ఇటలీ (157) ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్ (78), ఇరాన్ (70) వరుసగా నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచాయి.
India Wada Rank: డోప్ ఉల్లం'ఘనుల'లో భారత్‌కు మూడో ర్యాంకు - వాడా రిపోర్ట్ 2019
India Wada Rank: ప్రపంచ డోప్ ఉల్లంఘనుల జాబితాలో మూడో ర్యాంకులో నిలిచింది భారత్. 2019 ఏడాదికిగానూ వాడా(World Anti Doping Agency) ప్రకటించిన జాబితాలో రష్యా, ఇటలీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

WADA report
2019లో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి ఎక్కువగా డోప్ ఉల్లంఘనలు జరిగాయి. ఒక్క బాడీ బిల్డింగ్‌లోనే 57 ఉల్లంఘనలు నమోదయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో 25, అథ్లెటిక్స్‌లో 20, రెజ్లింగ్‌లో 10, బాక్సింగ్‌లో 4, జూడోలో 4, క్రికెట్లో 4 డోప్ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. 2018లో భారత్ (107) నాలుగో స్థానంలో నిలిచింది.