యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరగనున్నట్లు జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్) అధ్యక్షుడు ఉదిత్శేత్ గురువారం వెల్లడించారు.
'భారత్లో 2022 జూన్లో తొలిసారిగా ప్రపంచ యోగా ఛాంపియన్ నిర్వహించనున్నాం. ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా ప్రభుత్వానికి ధన్యవాదాలు' అని ఉదిత్శేత్ పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో కూడా యోగాకు క్రీడగా మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.