తెలంగాణ

telangana

ETV Bharat / sports

Australia Open Super 500 : ఫైనల్స్​కు ప్రణయ్​.. ఆ భారత షట్లర్​ను ఓడించి.. - ఆస్ట్రేలియా ఓపెన్​ 2023లో పీవీ సింధు

Australia Open Super 500 : ఆస్ట్రేలియా ఓపెన్​ సెమీస్​ టోర్నీలో భారత స్టార్​ షట్లర్​ హెచ్​ ఎస్​ ప్రణయ్​ గెలుపొందాడు. భారత షట్లర్​ ప్రియాన్షు ప్రజావత్​పై 21-18, 21-12 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్స్​కు చేరుకున్నాడు.​

hs prannoy australia open
hs prannoy

By

Published : Aug 5, 2023, 3:25 PM IST

Updated : Aug 5, 2023, 4:19 PM IST

Australia Open Super 500 : భారత స్టార్​ షట్లర్​ హెచ్​ ఎస్​ ప్రణయ్​ మరోసారి విజృంభించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్​ సెమీస్​ టోర్నీలో తన ప్రత్యర్థి అయిన మరో భారత షట్లర్​ ప్రియాన్షు ప్రజావత్​పై 21-18, 21-12 తేడాతో గెలుపొందాడు. తద్వారా ఫైనల్స్​కు చేరుకున్నాడు. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 9 ర్యాంక్‌లో ఉన్న ప్ర‌ణయ్​.. కేవ‌లం 43 నిమిషాల్లో ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించాడు.ఈ గెలుపుతో ప్ర‌ణ‌య్‌ తొలిసారి సూప‌ర్ 500 టోర్నీలో సెమీస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌తో రానున్న మ్యాచ్​కు ప్ర‌ణ‌య్ త‌ల‌ప‌డ‌నున్నాడు.

Australia Open Hs Prannoy : ఇక శుక్రవారం జరిగిన క్యార్టర్స్​లో ఆరో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్.. టాప్ సీడ్ అంథోని గింటింగ్‌తో తలపడ్డాడు. ఈ పోరులో 16-21, 21-17, 21-14 తేడాతో ప్రణయ్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడిపోయినప్పటికీ రెండో సెట్‌లో వేగం పుంజుకుని సెమీస్​కు చేరుకున్నాడు. కాగా ప్రణయ్‌కు ఈ ఏడాది ఇది సూపర్ - 500 టోర్నీలలో మూడో సెమీస్ కావడం విశేషం.

ఆ ఇద్దరికీ నిరాశే..
PV Sindhu Australia Open : మరోవైపు ఇండియా స్టార్‌‌ షట్లర్స్ కిడాంబి శ్రీకాంత్‌‌,​ పీవీ సింధు, తమ పేలవ ఫామ్​ను కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌–500 టోర్నీలో క్వార్టర్‌‌ ఫైనల్లోనే వెనుతిరిగారు. మహిళల సింగిల్స్​లో ఐదోసీడ్‌‌గా బరిలోకి దిగిన సింధు 12–21, 17–21తో నాలుగోసీడ్‌‌ బీవెన్‌‌ జాంగ్‌‌ చేతిలో ఓటమిపాలైంది. గతంలో జాంగ్‌‌తో తలపడి పది మ్యాచ్‌‌ల్లో ఆరుసార్లు నెగ్గిన సింధు.. ఈ సారి మాత్రం పట్టు సాధించలేకపోయింది.

Kidambi Srikanth Australia Open : ఇక పురుషుల క్వార్టర్‌‌ ఫైనల్స్​లో కిడాంబి శ్రీకాంత్‌‌ 13–21, 8–21తో ఇండియాకు చెందిన ప్రియాన్షు రజావత్‌‌ చేతిలో ఓడాడు. తొలి రౌండ్‌లో గట్టి పోటీనిచ్చినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన రెండో రౌండ్‌లో శ్రీకాంత్ పూర్తిగా డీలాపడిపోయాడు. అదే టోర్నీలోని సెమీస్​.. ఆరోసీడ్‌‌ హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌ 16–21, 21–17, 21–14తో టాప్‌‌సీడ్‌‌ ఆంథోని సిన్సుకా గింటింగ్‌‌ (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించాడు.

Malaysia Masters 2023 టైటిల్ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్

HS Prannoy BWF: ప్రణయ్‌ సంచలన విజయం

Last Updated : Aug 5, 2023, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details