సిప్రస్ వేదికగా వచ్చే నెల 4 నుంచి 13వ తేదీ వరకు షూటింగ్ ప్రపంచకప్ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు భారత బృందం వెళ్లాలి. అయితే కరోనా ప్రభావం కారణంగా వెనక్కి తగ్గింది. ఈ విషయాన్ని శుక్రవారం.. జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
కరోనా దెబ్బకు షూటింగ్ ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్
ప్రాణాంతకర కరోనా ప్రభావం కారణంగా, వచ్చే నెలలో జరగబోయే షూటింగ్ ప్రపంచకప్‌నకు భారత బృందం వెళ్లట్లేదు. ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు.
భారత షూటర్లు
చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ వైరస్ ప్రభావం.. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు దాదాపు 3000 మంది మరణించగా, 80 వేల మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు నిర్ధరించారు. అయితే భారత్‌లోనూ వచ్చే నెల 16 నుంచి 26 మధ్య షూటింగ్ ప్రపంచకప్ జరగనుంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే ఆరు దేశాలు ఈ టోర్నీ నుంచి విత్‌డ్రా అయ్యాయి.
Last Updated : Mar 2, 2020, 9:18 PM IST