India Open 2022: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది. భారత్‌కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) తెలిపింది.
కరోనా బారిన పడ్డవారిలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, కుషి గుప్తాలు ఉన్నారు.
"ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఏడుగురితో సన్నిహిత సంబంధాలున్న ఆటగాళ్లనూ టోర్నీ నుంచి తప్పుకున్నాం. కరోనా సోకిన ప్లేయర్స్‌కు బదులు ఎవరినీ తీసుకోం. ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్‌కు పంపిస్తాం." అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో ఉంది.