తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండియా ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్, సాత్విక్- చిరాగ్ జోడీ.. సింధుకు ఓటమి - లక్ష్యసేన్ ఇండియా ఓపెన్

India Open 2022: భారత్​కు చెందిన యువ షట్లర్ లక్ష్యసేన్​ ఇండియా ఓపెన్​ 2022లో సత్తాచాటాడు. సెమీస్​లో మలేసియాకు చెందిన ట్సే యాంగ్​పై విజయం సాధించాడు. మరోవైపు సాత్విక్​- చిరాగ్​ జోడీ కుడా సెమీస్​లో గెలిచి ఫైనల్స్​కు చేరింది. పీవీ సింధు సెమీస్​లో ఓటమి చవిచూసింది.

lakshya sen
లక్ష్య సేన్

By

Published : Jan 15, 2022, 4:53 PM IST

Updated : Jan 15, 2022, 9:02 PM IST

India Open 2022: ఇండియా ఓపెన్​ 2022 సెమీఫైనల్లో.. యువ షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. కేడీ జాదవ్ స్టేడియంలో జరుగుతున్న ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్స్​లో శనివారం.. మలేసియాకు చెందిన ఎన్​జీ ట్సే యాంగ్​ను(NG Tze Yong) 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి ఫైనల్స్​లోకి దూసుకెళ్లాడు.

టైటిల్​ పోరులో సింగపూర్​కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కియాన్​ యూతో(Loh Kean Yew) తలపడనున్నాడు లక్ష్యసేన్.

సాత్విక్- చిరాగ్ జోడీ

సాత్విక్- చిరాగ్ జోడీ..

మరోవైపు సాత్విక్- చిరాగ్ పురుషుల డబుల్స్ జోడీ కూడా ఇండియా ఓపెన్​లో ఫైనల్స్​కు చేరుకుంది. సెమీ ఫైనల్లో ఫ్రాన్స్​కు చెందిన ఫాబియెన్ డెల్రూ, విలియమ్ విల్లెజెర్ జోడీపై 21-10, 21-18 తేడాతో విజయం సాధించింది.

సింధు ఓటమి..

స్టార్​ షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. ఇండియా ఓపెన్ సెమీ ఫైనల్లో థాయ్​లాండ్​కు చెందిన సుపనిద కటెథాంగ్(Supanida Katethong) చేతిలో ఓటమిపాలైంది సింధు. 14-21, 21-13, 10-21 తేడాతో ఓటమి చవిచూసింది.

ఇదీ చదవండి:

PV Sindhu India Open: సెమీస్​లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

Last Updated : Jan 15, 2022, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details