తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ రిలే ఛాంపియన్స్​కు భారత్ దూరం

పోలెండ్లో జరగబోయే పోటీలకు వెళ్లే దారిలేకపోవడం వల్ల భారత మహిళల, పురుషుల అథ్లెట్ల బృందం.. ప్రపంచ రిలే ఛాంపియన్​షిప్స్​కు దూరమైంది. దీంతో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.

India miss Olympic qualifier World Relays
ద్యుతి చంద్ హిమాదాస్

By

Published : Apr 29, 2021, 6:34 AM IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని తపనపడ్డ హిమదాస్‌, ద్యుతి చంద్‌ లాంటి స్టార్‌ అథ్లెట్లతో కూడిన భారత మహిళల 4×100మీ. రిలే జట్టు ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. పోలెండ్‌లోని సిలేసియాలో శనివారం ఆరంభమయ్యే ఈ ఒలింపిక్స్‌ అర్హత ఛాంపియన్‌షిప్స్‌ కోసం నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ మీదుగా భారత మహిళల రిలే జట్టుతో పాటు పురుషుల 4×400మీ అథ్లెట్ల బృందం ప్రయాణించాల్సి ఉంది.

ద్యుతి చంద్

గురువారం తెల్లవారుజామున విమానంలో వాళ్లు ఆమ్‌స్టర్‌డామ్‌కు బయల్దేరాలి. కానీ వైరస్‌ ఉద్ధృతి కారణంగా భారత్‌ నుంచి వచ్చే విమానాలను అనుమతించట్లేదని సోమవారం సాయంత్రమే ఆ దేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి పోలెండ్‌కు నేరుగా విమానం లేకపోవడం వల్ల ఇతర ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నించిన భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ).. చివరకు పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

ఈ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే రిలే జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. మహిళల 4×100మీ. జట్టులో హిమ, ద్యుతి, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ ఉన్నారు. ఇప్పటికే ఫిట్‌నెస్‌ లేని కారణంగా మహిళల 4×400మీ. రిలే జట్టు ఈ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పుకుంది.

ABOUT THE AUTHOR

...view details