2036 లేదా 2040 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు. 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా బ్రిస్బేన్(ఆస్ట్రేలియా) గత నెలలో ఎంపికైంది. ఈ నేపథ్యంలో 2036, 2040 సంవత్సరాల్లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే దేశాల్లో భారత్ సహా.. ఇండోనేసియా, జర్మనీ, ఖతార్‌లు ఉన్నట్లు ప్రముఖ పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్'(WSJ)కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాచ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా ధ్రువీకరించారు.
"ప్రస్తుతానికిది నాకొచ్చిన ఆలోచన మాత్రమే. దీర్ఘకాల ప్రణాళికల్లో భాగంగా భారత్ ఈ క్రీడలను నిర్వహించగలదనే అనుకుంటున్నా."
-థామస్ బాచ్, ఐఓసీ అధ్యక్షుడు