Goalkeeper PR Sreejesh: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్‌కీపర్ శ్రీజేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ ఘనత సాధించింది.
"ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఈ అవార్డుకు నామినేట్ చేసినందుకు ఎఫ్ఐహెచ్కి.. నాకు ఓటు వేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ హాకీ ప్రేమికులందరికీ ధన్యవాదాలు. నామినేట్ అవడం ద్వారా నా వంతు పని నేను చేశాను. కానీ మిగిలింది అభిమానులు, హాకీ ప్రేమికులు పూర్తి చేశారు. కాబట్టి ఈ అవార్డు వారికే దక్కుతుంది. నాకంటే వారే ఈ అవార్డుకు అర్హులని భావిస్తున్నాను. ఇది భారతీయ హాకీకి కూడా గొప్ప క్షణం. హాకీ సంఘంలోని ప్రతి ఒక్కరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హాకీ సమాఖ్యలు నాకు ఓటు వేశాయి. కాబట్టి హాకీ కుటుంబం నుంచి మద్దతు లభించడం ఆనందంగా ఉంది."
- శ్రీజేష్