ఖతార్‌లో శుక్రవారం నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ప్రముఖ క్రీడాకారులైన హిమదాస్,నీరజ్ చోప్రా లేకుండానేఈ పోటీల్లో బరిలోకి దిగుతోంది భారత బృందం. మోచేయి చికిత్స కారణంగా నీరజ్, వెన్నెముక గాయంతో హిమదాస్ ఈ టోర్నీకి దూరమయ్యారు.
2017 లండన్‌లో జరిగిన గత ఎడిషన్‌లో కేవలం ఒకే ఒక్క భారతీయ అథ్లెట్(జువెలిన్ త్రో విభాగంలో దేవిందర్ సింగ్ కంగ్) మాత్రమే ఫైనల్‌కు చేరాడు. రేస్ వాకర్స్, మారథాన్ క్రీడాకారులు తమ తమ విభాగాల్లో నిరుత్సాహపరిచారు.
ఇప్పుడు వెళుతున్న 27 మంది సభ్యుల భారత బృందంలో 13 మంది అథ్లెట్లు రిలేలో పాల్గొననున్నారు. ధరుణ్ అయ్యస్వామి 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో పోటీ పడనున్నాడు. జాతీయ పతక విజేత మహమ్మద్ అనాస్.. క్వాలిఫికేషన్ మార్క్‌ను అందుకోని కారణంగా అర్హత సాధించలేకపోయాడు.