25 మీటర్ల పిస్టోల్ విభాగంలో భారత్ క్లీన్‌స్వీప్
12:36 March 24
చింకీ యాదవ్‌కు స్వర్ణం
దిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రంపచకప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో అన్ని పతకాలను కైవసం చేసుకుంది మన మహిళ షూటర్ల బృందం. ఈ విభాగంలో చింకీ యాదవ్ స్వర్ణం దక్కించుకోగా.. రాహీ సావంత్, మను బాకర్ వరుసగా వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఇప్పటికే ఈ ముగ్గురు టోక్యో ఒలింపిక్స్‌లో తమ స్థానాల్ని ఖరారు చేసుకున్నారు.
అంతకుముందు బుధవారం ఉదయం, పురుషుల విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.