టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అదరగొట్టింది. అన్ని క్రీడల్లో అత్యుత్తమంగా రాణించింది. ఏకంగా ఏడు పతకాలు సాధించి.. ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన రికార్డును తిరగరాసింది. లండన్ ఒలింపిక్స్(2012)లో సాధించిన 6 పతకాలు ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉన్నాయి.
పతకం కోసం రోజుల తరబడి ఎదురుచూడకుండా.. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండోరోజే సిల్వర్ మెడల్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజతాన్ని కొల్లగొట్టింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు(కాంస్యం), బాక్సింగ్‌లో లవ్లీనా(కాంస్యం), రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా(కాంస్యం), రవి కుమార్ దహియా(రజతం) పతకాలు సాధించారు.