ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం - చెస్ ఒలింపియాడ్ విజేత భారత్
20:10 August 30
చెస్ ఒలింపియాడ్ విజేతగా భారత్-రష్యా
ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతర్జాల వేదికగా నిర్వహించిన ఈ పోటీలో రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 93 ఏళ్ల ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.
భారత్‌ను విజేతగా నిలపడంలో ప్రముఖ క్రీడాకారిణి కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడ్డారు. మ్యాచ్ డ్రా కావడం వల్ల భారత్- రష్యాను ఉమ్మడి విజేతగా ప్రకటించారు.