Ind Vs Ban Asian Games 2023 :ఆసియా క్రీడలు మహిళల క్రికెట్ సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ సత్తా చాటింది. క్వార్టర్స్‌లో ఓ పాయింట్ అందుకుని సెమీస్‌కు దూసుకెళ్లిన స్మృతి సేన.. ఆదివారం ఉదయం ప్రారంభమైన సెమీస్‌లోనూ బంగ్లాదేశ్ జట్టుపై అత్యద్భుత ప్రదర్శనను కనబరిచింది. 8 వికెట్ల తేడాతో బంగ్లా జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. 17.5 ఓవర్లకు.. 51 పరగులు స్కోర్ చేసి ఆలౌట్ అయ్యారు.
Ind Vs Ban Womens Cricket : ఆ తర్వాత లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడినా.. జెమీమా రోడ్రిగ్స్ (20*), కనికా (1*) నాటౌట్‌గా నిలిచి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇక భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీసి రాణించగా.. టిటాస్, అమన్‌జోత్, దేవికా, రాజేశ్వరి చెరో వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక సెమీస్‌లో సత్తా చాటడంతో టీమ్‌ఇండియాకూ పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ గెలిస్తే టీమ్‌ఇండియాకు స్వర్ణమే.
India Women vs Malaysia Women : అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో మలేసియాతో జరిగిన టీమ్ఇండియా మ్యాచ్.. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు స్కోర్ చేసింది. అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా.. రెండు బాల్స్ కూడా ఎదుర్కొక ముందే మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేసిన మేనేజ్మెంట్.. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో మ్యాచ్ రద్దయినప్పటికీ.. రన్‌రేట్ ప్రకారం టీమ్ఇండియా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.