ఒలింపిక్స్ లాంటి మెగాటోర్నీలో పతకం సాధించిన వారికి, ఓడిపోయిన వారి ప్రదర్శనకు ఒక్క శాతం వ్యత్యాసం మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా. దాన్ని అందుకునేందుకు ఆటలో శిక్షణతో పాటు మానసిక సన్నద్ధత చాలా అవసరమని ఆయన అన్నారు.
శనివారం ఈఎల్ఎమ్ఎస్ ఫౌండేషన్, అభినవ్ బింద్రా ఫౌండేషన్ కలిసి అత్యత్తమ స్థాయి లీడర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. క్రీడలపై అత్యున్నత స్థాయిలో ప్రావీణ్యం, అవగాహన ఉన్న నిపుణులు ఇందులో భాగస్వాములుగా ఉంటారు. వారందరూ కలిసి భారత క్రీడాకారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, పలు టెక్నిక్‌లు చెప్పడం, మెగాటోర్నీలకు మానసికంగా సన్నద్ధం చేయడంలో తోడ్పడతారు.
"టాలెంట్ గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, అథ్లెట్లుగా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడం వల్ల క్రీడల్లో మెరుగైన ఫలితాలు రాబట్టగలం. ఒలింపిక్స్ కోసం అందరూ అత్యుత్తమంగా సన్నద్ధమవుతారు. కాని అందరికంటే ఒక్కశాతం ఎక్కువ ప్రదర్శన చేసిన వారే పతకాలు పొందుతారు. అందుకే ఆ స్థాయిని అందుకునే వాతావరణం కల్పించి క్రీడాకారుల్లో ప్రేరణ కలిగించాలని ఆశిస్తున్నాం. వారే భవిష్యత్తులో భారత క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్తారు. మరింత మందిని మెరికల్లా తయారు చేస్తారు. అప్పుడు భారత్ కూడా మిగతాదేశాలతో మరింత పోటీ పడి పతకాలు సాధిస్తుంది"