దోహా వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో 5000 మీటర్ల పరుగు పందెం ఉత్కంఠగా సాగుతుండగా.. ఇంకో రౌండు అయితే రేసు పూర్తవుతుందనగా అరుబా దేశానికి చెందిన రన్నర్ జోనాథన్ అలసిపోయి పరుగెత్తలేకపోయాడు.. అది చూసిన గున్యా అథ్లెట్ బ్రైమా సుంకర్ డాబో తన పరుగుని ఆపుకుని జోనాథన్కు సాయమందించాడు. ఈ సంఘటన చూసిన అందరూ డాబో క్రీడాస్ఫూర్తికి ఫిదా అయ్యారు.
గోల్డ్ గెలవకపోయినా.. ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు - Runner wins hearts by helping rival cross the finish line
శుక్రవారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గున్యా దేెశానికి చెందిన రన్నర్ బ్రైమా సుంకర్ తన క్రీడాస్ఫూర్తితో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలసిపోయి పరుగెత్తలేకపోయిన అరుబా రన్నర్ బ్రైమా సుంకర్కు సాయమందించి ప్రేక్షకుల మనసులు గెలిచాడు.
![గోల్డ్ గెలవకపోయినా.. ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4578722-thumbnail-3x2-sport.jpg)
అథ్లెట్
ఆఖరి రౌండ్ పూర్తి చేసే వరకు జోనాథన్కు తోడుగా ఉండి.. అందరి మన్ననలు అందుకున్నాడు డాబో. తోటి రన్నర్లంతా పరుగును పూర్తి చేసి ఐదు నిమిషాలు గడిచిన తర్వాత అరుబా రన్నర్తో కలిసి గమ్యాన్ని చేరుకున్నాడు. రేసులో పతకం గెలవకపోయినా.. తన బంగారు మనసుతో ప్రేక్షకుల గుండెల్లో గోల్డ్ సాధించాడు డాబో.
ఇదీ చదవండి: నీటిలో క్రికెట్ ప్రాక్టీస్ చేసిన మాస్టర్ బ్లాస్టర్
Last Updated : Oct 2, 2019, 8:22 AM IST