తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: ఆనంద్

ప్రపంచ మాజీ చెస్​ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన తండ్రి కె. విశ్వనాథన్​కు నివాళులర్పించారు. తండ్రితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. సరైన సూచనలిస్తూ తన విజయాలకు కారణమయ్యాడని పేర్కొన్నాడు.

vishwanathan anand, k.vishwanathan
విశ్వనాథన్ ఆనంద్, కె. విశ్వనాథన్

By

Published : Apr 18, 2021, 1:26 PM IST

Updated : Apr 18, 2021, 1:37 PM IST

చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన తండ్రి కె. విశ్వనాథన్​కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు. గురువారం అనారోగ్యం కారణంగా మృతిచెందిన ఆయనను స్మరించుకున్నాడు ఆనంద్.

"ఏప్రిల్​ 15న మా తండ్రి కె. విశ్వనాథన్ అనారోగ్యంతో మృతిచెందారు. చెన్నైలో ఉన్నప్పుడు ఆయనను తరచూ కలిసే అవకాశం వచ్చేది. ఆయనకు నేను రుణపడి ఉంటా. చెస్​ కెరీర్​లో ఎదగడానికి మా తల్లి ఎంతగానో సహకరించారు. తండ్రి పాత్ర మరింత కీలకం. ఆయన ఎప్పడూ నాకు మద్దతుగా నిలిచేవారు. మూడు జాతీయ టైటిళ్లు, ప్రపంచ ఛాంపియన్​ టైటిల్​ గెలిచినప్పుడు ఆయన నాకు ఇచ్చిన ధైర్యాన్ని మరచిపోలేను. ప్రతిసారి నాకు సరైన సలహాలు ఇస్తుండేవారు"

--విశ్వనాథన్ ఆనంద్, మాజీ చెస్ ఛాంపియన్.

తండ్రితో గడిపిన ఆనందక్షణాలను మర్చిపోలేనని విశ్వనాథన్ అన్నాడు. రైల్వే ఉద్యోగంలో తన తండ్రి సాధించిన ఘనతలకు గర్వపడుతున్నట్లు తెలిపాడు.

ఇదీ చదవండి:కేఎల్ రాహుల్..‌ 'పంజాబ్‌' కింగ్‌ మేకర్‌!

Last Updated : Apr 18, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details