స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? తన కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. తాజాగా మెస్సీ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ గురించి ఓ హింట్ ఇచ్చాడు మెస్సీ. కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన జీవితంలో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన క్షణాలు అత్యద్భుతమని.. అంతకు మించి తాను ఏదీ కోరుకోవట్లేదని చెప్పాడు. "నా కేరీర్లో, వ్యక్తిగతంగా కావాల్సివన్నీ ఉన్నాయి. నా కెరీర్‌ను సరికొత్తగా ముగించాలనుకుంటున్నాను. నేను నా కెరీర్‌ను మొదలు పెట్టినప్పుడు.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. కానీ నాకు ఇది జరుగుతుండటం చాలా ఉత్తమం. మేము 2021లో కోపా అమెరికా కప్, ఇటీవల సాకర్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్నాము. ఇక మిగిలింది ఏమీ లేదు" అని చెప్పాడు.
'నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి'.. రిటైర్మెంట్పై మెస్సీ కీలక వ్యాఖ్యలు - అర్జెంటీనా లియోనెల్ మెస్సీ
ఫిఫా వరల్డ్‌కప్ విజేత లియోనెల్ మెస్సీ తన రిటైర్మెంట్పై కీలక కామెంట్లు చేశాడు. తనకు జీవితంలో అన్నీ ఉన్నాయని.. అంతకు మించి ఇంకా ఏం కోరుకోవట్లేదని చెప్పాడు. దీంతో మెస్సీ త్వరలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడంటూ చర్చ మొదలైంది.
Lionel Messi retirement hint
ఈ స్టార్ సాకర్ ప్లేయర్ కతార్‌లో జరిగిన ఫిపా వరల్డ్ కప్ 2022లో అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకుముందు కోపా అమెరికా, ఫైనలిస్సిమా గెలిచాడు. చాలా సార్లు ballon d'or అవార్డులను సొంత చేసుకున్నాడు. అయితే, ఇంతకుముందు 2016 మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కొన్ని రోజల తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ మెస్సీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో త్వరలోనే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ చర్చనడుస్తోంది.