ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ హుసాముద్దీన్ సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శనతో అతను సెమీఫైనల్లో ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. మహిళల విభాగంలో సిమ్రన్‌జీత్ (60 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఆమె 4-1తో మరియానా (ఉక్రెయిన్)ను ఓడించింది. జర్మనీలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్లో హుసాముద్దీన్ 5-0తో ఉమర్ బజ్వా (జర్మనీ)ని చిత్తు చేశాడు.
పతక పంచ్: ప్రపంచకప్ సెమీస్‌లోకి హైదరాబాదీ - asia sports winner satish kumar
అంతర్జాతీయ వేదికపై హెదరాబాద్ కుర్రాడు అదరగొట్టాడు. ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో మహ్మద్ హుసాముద్దీన్.. సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం చేజిక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో జర్మనీ క్రీడాకారునిపై నెగ్గి ఈ ఘనత సాధించాడు.
ప్రపంచకప్ సెమీస్‌లోకి ప్రవేశించిన హైదరాబాదీ
హుసాముద్దీన్ దూకుడు ముందు ఉమర్ నిలువలేకపోయాడు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీష్‌కుమార్ (91 కేజీలు) కూడా సెమీస్ చేరాడు. అతను 5-0తో అలెక్సెల్ (మాల్దోవా)ను ఓడించాడు. 57 కేజీల విభాగంలో గౌరవ్ సోలంకీ, కవీందర్ బిస్త్ సెమీస్ చేరగా.. ఆశిష్ కుమార్ (75 కేజీలు) క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టాడు. అతను 1-3తో మ్యాక్స్‌వాన్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం చవిచూశాడు.
ఇదీ చూడండి:బాక్సింగ్ ప్రపంచకప్ ఫైనల్లో అమిత్ పంగల్