తెలంగాణ

telangana

ETV Bharat / sports

HS Prannoy Match Today : అదరగొట్టిన ప్రణయ్​.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పతకం పక్కా.. సాత్విక్​ జోడీకి నిరాశ.. - BWF World Championships 2023

HS Prannoy Match Today : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్​ ఎస్​ ప్రణయ్‌ అదరగొట్టాడు. డెన్మార్క్‌కి చెందిన‌ డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌ను 13-21, 21-15, 21-16 తేడాతో చిత్తు చేసిన ప్రణయ్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు.

HS Prannoy Match Today
హెచ్​ ఎస్​ ప్రణయ్‌

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 6:25 AM IST

Updated : Aug 26, 2023, 7:25 AM IST

HS Prannoy Match Today : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్​ ఎస్​ ప్రణయ్‌అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో విజయంతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు. కొపెన్‌హెగెన్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కి చెందిన‌ డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌ను 13-21, 21-15, 21-16 తేడాతో చిత్తు చేసిన ప్రణయ్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఇక శనివారం జరిగే సెమీస్‌లో ప్రణయ్‌ థాయ్‌లాండ్‌ ఆటగాడితో తలపడనున్నాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో భారత స్టార్‌ ద్వయంసాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓటమిపాలైంది. రస్ముస్సెన్‌-ఆస్ట్రప్‌ చేతిలో 21-18, 21-19 తేడాతో భారత ద్వయం ఓడిపోయింది.

Prannoy BWF World Championships 2023 :ప్రారంభ గేమ్​హోరాహోరీగా సాగినప్పటికీ.. అక్సెల్సన్‌ నిలకడగా ఆధిక్యంలోనే ఉన్నాడు. ఇక 12-17తో వెనుకబడ్డ దశలో ప్రణయ్‌ వేగం పుంజుకుని వరుసగా అయిదు పాయింట్లతో స్కోరు సమం చేసినప్పటికీ.. చివరికి గేమ్‌ ప్రత్యర్థికే సొంతమైంది. అయితే నిరాశ చెందని ప్రణయ్​ రెండో గేమ్​లో తన సత్తా చాటేందుకు ప్రయత్నించాడు.

అయితే రెండో గేమ్‌ మొదట్లోనే ప్రణయ్‌ 1-7తో వెనుకబడటం వల్ల ఇక అతడి పనైపోయినట్లే అని అనిపించింది. కానీ ప్రణయ్‌ పట్టు వదల్లేదు. ఆఖరి వరకు గొప్పగా పోరాడాడు. 15-15తో స్కోరు సమం చేశాడు. ఇక 17-17 వద్ద ప్రణయ్‌ దూకుడుగా ఆడి అక్సెల్సన్‌కు షాకిచ్చాడు. వరుసగా మూడు పాయింట్లను సాధించి గేమ్‌ విజయానికి చేరువయ్యాడు. ఇక అక్సెల్సన్‌ అతణ్ని అందుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌ అనూహ్యంగా ఏకపక్షమైంది. అయితే అప్పటికే అలసిపోయిన అక్సెల్సన్‌.. ప్రణయ్‌ దూకుడు ముందు నిలవలేకపోయాడు. 5-5 వద్ద విజృంభించిన అతను.. వరుసగా పాయింట్లు కొల్లగొడుతూ 16-6తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత ప్రణయ్‌ విజయం లాంఛనమే అయింది.

ఆ జోడీకి నిరాశే : ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి, మరోసారి పతక ఫేవరెట్లుగా టోర్నీలో అడుగు పెట్టిన సాత్విక్‌ సాయి -చిరాగ్‌ శెట్టిలకు ఈ గేమ్​లో నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచిన ఈ స్టార్ జోడీకి.. కిమ్‌ ఆస్ట్రప్‌-ఆండర్స్‌ స్కారుప్‌ జోడీ చెక్‌ పెట్టింది. దీంతో హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో భారత ద్వయం 18-21, 19-21తో డెన్మార్క్‌ జంట చేతిలో పరాజయం పాలైంది.

ఇక తొలి గేమ్‌లో ఒక్కసారిగా ఆధిక్యం సాధించకపోయినప్పటికీ చివర్లో మాత్రం ప్రత్యర్థుల స్కోరుకు చేరువగా వచ్చి గేమ్‌ను చేజార్చుకున్న సాత్విక్‌-చిరాగ్‌.. రెండో గేమ్‌లో 15-15తో స్కోరు సమం చేసి తీరు.. మ్యాచ్‌ను మూడో గేమ్‌కు మళ్లించేలా కనిపించింది. అయితే ఇక్కడి నుంచి ప్రతి పాయింట్‌ కోసం పోరాటం తీవ్ర స్థాయిలో సాగింది. కానీ ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ప్రత్యర్థి జోడీ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.

స్విస్​ ఓపెన్​లో మెరిసిన భారత షట్లర్లు.. టైటిల్​ కైవసం

Malaysia Masters 2023 : పీవీ సింధుకు నిరాశ.. ఫైనల్స్​కు చేరిన ప్రణయ్​

Last Updated : Aug 26, 2023, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details