విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు నీరజ్ చోప్డా. టోక్యో ఒలింపిక్స్‌లో 23 ఏళ్ల నీరజ్ జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించినవేళ దేశవ్యాప్తంగా సంబరాలు అంబురాన్నంటాయి.
దేశవ్యాప్తంగా చర్చ..
రాష్ట్రపతి, ప్రధాని నుంచి మొదలుకొని సామాన్యుని వరకు అందరూ నీరజ్ చోప్డా గురించే చర్చించారు. 2012లో అండర్ 16 జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన నీరజ్.. 2015లో జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డ్ నెలకొల్పి ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపుకు తిప్పాడు నీరజ్. అయితే నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దాడడానికి తనలో ఎంత ప్రతిభ ఉందో, దానికి రెట్టించిన కష్టం కూడా ఉంది.
భారీగానే ఖర్చు..
నీరజ్ ప్రతిభ, కష్టాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్ కోసం భారీ వ్యయప్రయాసలకోర్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్‌కు ముందు 450 రోజుల పాటు నీరజ్ చోప్డా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,85,39,638 ఖర్చు చేసింది.
నీరజ్ కోచ్‌కూ..