టోక్యో ఒలింపిక్స్ కోసం ఎందరో క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జులై 23 నుంచి విశ్వక్రీడలు అధికారికంగా ప్రారంభంకానున్నాయి. దానికంటే రెండురోజుల ముందు నుంచే సాఫ్ట్ బాల్, ఫుట్బాల్ టోర్నీలు ప్రసారమవబోతున్నాయి.
టోక్యో వేదికగా జరగనున్న ఈ ఒలింపిక్స్లో దాదాపుగా 206 దేశాల నుంచి సుమారుగా 11 వేల అథ్లెట్లు పాల్గొంటున్నారు. 33 క్రీడల కోసం 339 బంగారు పతకాలను నిర్వాహకులు సిద్ధం చేశారు. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 119 క్రీడాకారులు టోక్యో చేరుకున్నారు. నేపథ్యంలో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎప్పుడు, ఎలా, ఎందులో ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చో తెలుసుకుందాం.
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం ఎక్కడ జరగనుంది?
జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్ జాతీయ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.