తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పటి నుంచే ఆటలు ప్రారంభం: కేంద్రమంత్రి

దేశంలో త్వరలోనే ఆటలు తిరిగి మొదలు కావొచ్చని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​​ రిజిజు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోటీలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్నినింపుతాయని అన్నారు.

Hopeful India will organize sporting events in Sept-Oct: Rijiju
అప్పటి నుంచే ఆటలుు ప్రారంభం!

By

Published : Jul 25, 2020, 7:20 AM IST

కరోనా లాక్​డౌన్​తో​ ప్రపంచవ్యాప్తంగా స్థంబించిన క్రీడా రంగం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మన దేశంలో సెప్టెంబరు లేదా, అక్టోబరులో తిరిగి టోర్నీలు నిర్వహించే అవకాశముందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైరస్​ సంక్షోభ పరిస్థితుల్లో ఆ టోర్నీలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని అన్నారు.

"కొన్ని పరిమితులతో క్రీడా కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ ప్రత్యేక నిబంధనలను ప్రతి క్రీడా సంఘం అనుసరించాల్సిందే. ఇటీవల ఒలింపిక్​ కోటా అథ్లెట్ల కోసం ప్రత్యేక శిబిరాలను మొదలు పెట్టామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంది. సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి దేశంలో టోర్నీలు ప్రారంభం అవతాయనే నమ్మకం ఉంది. వివిధ క్రీడలకు సంబంధించిన పెద్ద లీగ్​లు ఆరంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి" అని కామన్వెల్త్​ దేశాల మంత్రుల ఫోరమ్​ సమావేశంలో రిజిజు ​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details