హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత్ బోణీ కొట్టింది. గ్రూప్ డిలో భాగంగా స్పెయిన్‌తో తలపడిన మ్యాచ్‌లో 2-0తో ఘన విజయం సాధించింది. రవుర్కెలలోని బిర్సాముండా స్టేడియంలో స్పెయిన్‌తో జరిగిన పోరులో భారత్ ఆట ప్రారంభం నుంచి స్పెయిన్‌పై దూకుడు చూపిస్తూ ఆధిపత్యాన్ని చెలాయించింది. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు గోల్ సాధించే అవకాశం భారత డిఫెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ అద్భుతమైన డిఫెన్సింగ్ స్కిల్స్‌ను చూపించాడు.
Hockey world cup: హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం - హాకీ వరల్డ్ కప్ 2023 లైవ్ అప్డేట్స్

21:17 January 13
హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలి గోల్ కొట్టి ఖాతా తెరవగా.. హార్దిక్ సింగ్ 26వ నిమిషంలో రెండో గోల్ కొట్టాడు. దీంతో మ్యాచ్ ఆఫ్ టైం ముగిసేసరికి 2 గోల్స్‌తో ఆధిక్యంలో ఉంది. తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం కూడా అదే దూకుడు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది. స్పెయిన్‌పై విజయంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు నమోదయ్యాయి.
సొంతగడ్డపై టైటిల్‌పై కన్నేసి బరిలో దిగిన భారత ఆటగాళ్లు ఆట ఆరంభం నుంచి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించింది. తొలి క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను టాప్‌రైట్ కార్నర్ నుంచి గోల్‌గా మలిచి రోహిత్‌దాస్ భారత్ ఖాతా తెరిచాడు. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది 200వ గోల్. రెండో క్వార్టర్‌లో మరో ఆటగాడు హార్దిక్ సింగ్ ఎడమవైపు కార్నర్ నుంచి వేసిన గోల్‌ను స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుకోలేకపోయాడు. దీంతో ఈ గోల్ భారత్‌కు ఆటపై మరింత పట్టునిచ్చింది. భారత్ గోల్‌కీపర్ మూడు సార్లు స్పెయిన్ ఆటగాళ్లు వేసిన గోల్స్‌ను అడ్డుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా వైస్ కెప్టెన్ అమిత్ రోహిత్‌దాస్ నిలిచాడు. ప్రస్తుతం పూల్ డిలో మూడు పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. పూల్ డిలో వేల్స్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్ ఐదు పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. జనవరి 15న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి:సానియా మీర్జా సంచలన ప్రకటన